BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం
Date of Publish : 04 July 2026, 06:35 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వర్షాకాలంలో దోమల విజృంభణ.. డెంగ్యూపై అప్రమత్తమే అసలైన ఆయుధం..! – చాట్రాయి మండల వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 06:35 AM
162 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో వర్షాకాలం ప్రారంభం కావడంతో దోమల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. చిన్నపాటి నిర్లక్ష్యమే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుందని చాట్రాయి మండల వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి హెచ్చరించారు. ఇంటి చుట్టూ నిల్వ ఉండే కొద్దిపాటి నీరే దోమలకు నిలయంగా మారి కుటుంబాల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోందని ఆమె పేర్కొన్నారు.

ప్రతి ఇంటిలో పరిశుభ్రత పాటించడం ద్వారానే దోమల నివారణ సాధ్యమని చెప్పారు. కూలర్లు, నీటి ట్యాంకులు, పూల కుండీలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా తరచూ శుభ్రం చేయాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు పూర్తి చేతుల దుస్తులు ధరించడంతో పాటు దోమతెరలు, మస్కిటో రిపెలెంట్లను వినియోగించాలని సూచించారు.

డెంగ్యూ లక్షణాలైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని తెలిపారు. స్వయంగా మందులు వాడటం వల్ల పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

"ఒక్క దోమ.. ఒక కుటుంబాన్ని ఆసుపత్రి పాలుచేయగలదు.. ఒక్క జాగ్రత్త.. ఒక ప్రాణాన్ని కాపాడగలదు" అనే నినాదంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. డెంగ్యూ నివారణ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత కూడా అని పేర్కొన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ దోమలపై సమిష్టిగా పోరాటం చేస్తేనే డెంగ్యూ వంటి వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమని డాక్టర్ విజయలక్ష్మి స్పష్టం చేశారు.