BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 08 June 2026, 06:03 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ.. వైద్య సేవలపై ఆరా తీసిన చైర్‌పర్సన్ నాగలక్ష్మి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
08 Jun, 2026 - 06:03 PM
131 వీక్షణలు

ధర్మపురి, జూన్ 8: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మున్సిపల్ చైర్‌పర్సన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ప్రయోగశాలల పనితీరు, వైద్యులు మరియు సిబ్బంది హాజరు వివరాలు, వైద్య పరికరాల వినియోగం, మందుల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ నాగలక్ష్మి మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన చికిత్స అందించేందుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అవసరమైన అన్ని సౌకర్యాలను ఆసుపత్రుల్లో కల్పించేందుకు కృషి చేస్తోందని ఆమె తెలిపారు. ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించి, అందుబాటులో ఉన్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, కౌన్సిలర్లు సంగనబట్ల సంతోషిని, చిపిరిశెట్టి రాజేష్, సంగి ఆనంద్, కొమురవెల్లి పవన్, జంజీరికాని సువర్ణ, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్.కె. షౌకత్, సుల్తానా, అశెట్టి మమత, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.