ప్రగడవరం లో కరెంటు కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు.. లైన్మెన్‌పై తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ పరిధిలోని గొల్లగూడెం రోడ్డు వద్ద విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రోడ్డుకు ఇరువైపులా బయటకు వచ్చిన గ్రామస్తులు విద్యుత్ శాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సమస్యను పరిష్కరించాలంటూ గ్రామస్తులు సంబంధిత లైన్మెన్‌కు ఫోన్ చేసినట్లు తెలిపారు. అయితే ఫోన్‌లో తమతో లైన్మెన్ బూతులు తిడుతూ దుర్భాషలాడినట్లు గ్రామస్తులు ఆరోపించారు. విద్యుత్ సమస్యపై ఫోన్ చేసిన తమతో ఇలా మాట్లాడటం ఏమిటంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో పాటు గ్రామస్తులతో దురుసుగా మాట్లాడిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.