BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 06:39 pm
Posted by : K MAHESH

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం

తెలంగాణ
/ వరంగల్
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 06:39 PM
18 వీక్షణలు

లంచం లేకుండా ఇళ్లు, పింఛన్లు మంజూరు చేస్తాం: మంత్రి సీతక్క

గంగారంలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ.. మహిళా సంఘాలకు అండగా ప్రభుత్వం

గంగారం, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గంగారం మండల కేంద్రంలో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని వందలాది మంది లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మంది చేయూత లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా పింఛన్లు మంజూరు చేస్తున్నామని, గీత కార్మికులు, నేత కార్మికులకు వృద్ధాప్య పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.

మహిళా సంఘాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల పేరుతో ఆర్టీసీ బస్సులు కేటాయిస్తున్నామని చెప్పారు. మహాదేవునిగూడెంలో ఇప్పపువ్వు లడ్డూల తయారీకి మహిళా సంఘాలకు రుణం అందించినట్లు వివరించారు. మేడారంలో మహిళా సంఘాలకు రూ.3 కోట్లు అందించగా, వారు రూ.10 కోట్ల లాభం సంపాదించారని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నామని, బ్యాంకుల ద్వారా కూడా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ బీమా పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళలు ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని చేయాలని, గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు.

పేదలకు ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయించుకోవడానికి ఎవరూ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో గంగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముడిగ వీరభద్ర పోతయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరబోయిన మొగిలి, మాజీ మండల అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గిరగాని ప్రవీణ్, మండల సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.