BREAKING
చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం
Date of Publish : 11 September 2026, 04:33 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్‌ జిల్లాలో 129 పాఠశాలల ఉపాధ్యాయుల సర్దుబాటుకు బ్రేక్

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
11 Sep, 2026 - 04:33 PM
7 వీక్షణలు

కలెక్టరేట్‌లో పెండింగ్‌లో సర్‌ప్లస్‌ టీచర్ల జాబితా.. విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలల్లో బోధనకు ఇబ్బందులు

వరంగల్ | Ntoday News

వరంగల్‌ జిల్లాలో మూతపడిన 129 పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ఆయా పాఠశాలల్లో పనిచేసిన మిగులు ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు సిద్ధం చేసిన సర్‌ప్లస్‌ టీచర్ల జాబితా ప్రస్తుతం కలెక్టరేట్‌లో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవోలు) తమ పరిధిలో గుర్తించిన మిగులు ఉపాధ్యాయుల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)కు అందజేశారు. అనంతరం ఈ జాబితాను కలెక్టర్‌ అనుమతి కోసం పంపినప్పటికీ ఇప్పటివరకు క్లియరెన్స్‌ రాకపోవడంతో సర్దుబాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదని సమాచారం.

మరోవైపు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా బోధనపై ప్రభావం పడుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మూతపడిన పాఠశాలల నుంచి మిగులు ఉపాధ్యాయులను అవసరమున్న పాఠశాలలకు త్వరగా సర్దుబాటు చేస్తే ఉపాధ్యాయుల కొరత కొంతవరకు తీరే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

కలెక్టరేట్‌ నుంచి సర్‌ప్లస్‌ టీచర్ల జాబితాకు త్వరగా అనుమతి లభించి, ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.