BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 05:30 pm
Posted by : K MAHESH

మహిళా సాధికారతే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 05:30 PM
18 వీక్షణలు
  • అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయం: ఎంపీ డాక్టర్ కడియం కావ్య
  • పరకాల నియోజకవర్గంలో 3,800 నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
  • 42 కిలోమీటర్ల హెచ్‌ఏఎం రహదారులతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

సంగెం: మహిళా సాధికారతకు, అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు. పరకాల నియోజకవర్గంలో సుమారు 3,800 నూతన చేయూత పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమని పేర్కొన్నారు.

సంగెం, గీసుగొండ మండలాల పరిధిలోని స్టేషన్ చింతలపల్లిలో ఉన్న టెక్స్‌టైల్ పార్క్ పైలాన్ వద్ద బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో కలిసి ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. దామెర, నడికూడ మండలాల్లో ఎంపీడీవో భవనాలు, పాల సేకరణ కేంద్రాల భవనాలు, 42 కిలోమీటర్ల హెచ్‌ఏఎం రహదారుల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎంపీ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పింఛన్ల మంజూరు ప్రక్రియలో కృషి చేసిన అధికారులను అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.5 లక్షల పింఛన్లు మంజూరు చేసిందని, వీటి కోసం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. గతంలో ఉన్న 40 లక్షల పింఛన్లకు కొత్తగా మంజూరైన వాటిని కలిపి రాష్ట్రంలో సుమారు 45 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని పేర్కొన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే చేయూత పథకం ఉద్దేశమని చెప్పారు.

రాష్ట్రంపై గత ప్రభుత్వం సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం ఉంచిందని పేర్కొన్న ఎంపీ.. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. రెండు విడతల్లో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఇందుకోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని కోటి 10 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ కోసం రూ.13,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. రైతు రుణమాఫీ, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలకూ ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు అందించి, వాటి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కడియం కావ్య తెలిపారు. మహిళా సంఘాలకు లక్ష కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుండగా, ఇప్పటికే సుమారు రూ.75 వేల కోట్ల రుణాలు అందించినట్లు చెప్పారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు, ఐకేపీ కేంద్రాల నిర్వహణ వంటి రంగాల్లో మహిళలను భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు. మహిళలను కేవలం పథకాల లబ్ధిదారులుగా కాకుండా వ్యాపారవేత్తలుగా, సంస్థల యజమానులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో 10 నుంచి 12 వేల మంది మహిళలను భాగస్వాములుగా చేస్తూ ఇందిరా మహిళా శక్తి డెయిరీ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీ పేర్కొన్నారు. ముల్కనూరు పాల ఉత్పత్తుల సహకార సంస్థ తరహాలో పరకాల మహిళా డెయిరీ కూడా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంస్థకు తన వంతు సహకారంగా ఎంపీ నిధుల నుంచి రూ.కోటి వరకు కేటాయించినట్లు వెల్లడించారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కృషి చేస్తున్నారని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మహిళా డెయిరీలు, క్యాంటీన్ల వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోందని ఎంపీ ఆరోపించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలను పరిశీలించుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మహిళల ఆర్థిక అభివృద్ధికి, పేదల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.