BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 10 July 2026, 09:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యూఏపీఏ రద్దు చేయాలని విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jul, 2026 - 09:01 PM
178 వీక్షణలు

విజయవాడ, జూలై 10: విజయవాడ నగరంలో సీపీఐ ఆధ్వర్యంలో యూఏపీఏ (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ మాట్లాడుతూ, ప్రశ్న రావణ్‌పై యూఏపీఏ చట్టాన్ని ప్రయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

యూఏపీఏ చట్టాన్ని రద్దు చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే విధంగా అమలవుతోందని విమర్శించారు. మతోన్మాద, ఫాసిస్ట్ శక్తుల బుల్డోజర్ పాలన ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగదని, గొప్ప పోరాట స్ఫూర్తి కలిగిన రాష్ట్ర ప్రజలు దానిని తిప్పికొడతారని హరినాథ్ అన్నారు.

అణిచివేతలకు పాల్పడిన పాలకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఈ సమావేశానికి ఈశ్వరయ్య అధ్యక్షత వహించగా, సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ, సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి. మధు, న్యూ డెమోక్రసీ నాయకుడు పి. ప్రసాద్, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి టి. వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు, జల్లి విల్సన్, అక్కినేని వనజ, ఎంసీపీఐ నాయకుడు ఖాదర్ బాషా, ఎస్‌యూసీఐ నేత అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.