BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 10 July 2026, 10:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పర్వతాపురం అటవీ ప్రాంతంలో విత్తన బంతుల వెదజల్లింపు కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jul, 2026 - 10:48 PM
157 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు అటవీశాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "విత్తన బంతులను వెదజల్లు" కార్యక్రమాన్ని జూలై 1 నుంచి నిర్వహిస్తున్నారు. "మొక్కలు నాటుదాం – భవిష్యత్తు కాపాడుకుందాం, హరిత భవిష్యత్తు కోసం అందరం ఏకమవుదాం" అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పర్వతాపురం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో, డీఆర్వో హనుమంతుడు పర్యవేక్షణలో బీట్ ఆఫీసర్ నూర్జహాన్, అడవి సంరక్షణ కమిటీ చైర్మన్ మిద్దె సత్యనారాయణతో కలిసి పలు రకాల విత్తన బంతులను అడవిలో వెదజల్లారు.

ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ, వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుని విత్తన బంతులను వెదజల్లడం ద్వారా అడవుల విస్తీర్ణం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.