BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 10 July 2026, 09:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండి సమాజ సేవలో ముందుండాలి: జిల్లా అధ్యక్షుడు కుక్కడపు నాగేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jul, 2026 - 09:01 PM
143 వీక్షణలు

గంపలగూడెం, జూలై 10: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెంలో శుక్రవారం వర్తక సంఘం భవన ఆవరణలో మండల ఆర్యవైశ్య సంఘం సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కుక్కడపు నాగేశ్వరావు మాట్లాడుతూ, ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి నాళ్ల చిన్న సత్యం బాబు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కుక్కడపు నాగేశ్వరావును శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కాజా రవికుమార్, జిల్లా కోశాధికారి కొత్తమాసు రామారావు, జిల్లా ఉపాధ్యక్షులు వేములపల్లి రామకృష్ణారావు, యువజన సంఘం అధ్యక్షుడు అనుమోలు శివబాజీ, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వనమా సుజాత, వర్తక వాణిజ్య కమిటీ చైర్మన్ కంభంపాటి బద్రీనాథ్, వాసవి సేవాదళ్ చైర్మన్ నందిగాం గౌరీశంకర్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సుగ్గల సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు మైలవరపు రామాంజనేయులు, జిల్లా కమిటీ సభ్యుడు కోట నాగేశ్వరావు, పట్టణ అధ్యక్షుడు నాళ్ల లక్ష్మణరావు, గంపలగూడెం ఆర్యవైశ్య ప్రముఖుడు కొత్తగుండ్ల నరసింహారావుతో పాటు పలువురు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.