BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 11 August 2026, 09:09 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

యువత భవితకు మత్తు ముప్పు వద్దు.. విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
11 Aug, 2026 - 09:09 PM
60 వీక్షణలు

యువత భవితకు మత్తు ముప్పు వద్దు.. విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా...

అన్నమయ్య జిల్లా - మదనపల్లి 

మదనపల్లి, ఆగస్టు 11: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ శివ్ నారాయణ శర్మ ఐఏఎస్ , జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు మంగళవారం అధికారులతో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా తనిఖీలను ముమ్మరం చేసి, విద్యార్థుల హాస్టళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

విద్యాసంస్థల చుట్టూ 100 మీటర్ల పరిధిలో గుట్కా, సిగరెట్ల విక్రయాలను పూర్తిగా నిషేధించాలన్నారు. దీని అమలు బాధ్యత ప్రధానోపాధ్యాయులదే అని సూచించారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 206 కేజీల గంజాయిని పట్టుకుని 26 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. స్మగ్లర్లపై ఎన్‌డీపీఎస్ కేసులతో పాటు, అవసరమైతే 'పీడీ యాక్ట్' ప్రయోగం చేయనున్నట్లు పేర్కొన్నారు.

'ఈగల్ క్లబ్స్' ద్వారా కళాశాలలు, పాఠశాలల్లో ప్రతి నెలా క్రమం తప్పకుండా విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.

గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలపై ఏ చిన్న సమాచారం ఉన్నా, ప్రజలు వెంటనే 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి అధికారులకు తెలపాలని విజ్ఞప్తి చేశారు.