నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ మండల నాయకులు .
NTODAY NEWS: ఆమడగూరు రిపోర్టర్ రామాంజనేయులు
సత్యసాయి జిల్లా ఆమడగూరు మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా మండలానికి విచ్చేసిన ఎస్సై సుమతిని మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు యనమల.గంగలప్ప ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ మండల కమిటీ తరఫున ఎస్సై సుమతికి మహిళాసంఘం సభ్యులు పూలమాల వేసి శాలువా కప్పి గౌరవ మర్యాదలతో ఎమ్మార్పీఎస్ కమిటీ పరిచయం చేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గంగులప్ప మాట్లాడుతూ ఎస్సీలు ఎస్టీలు నిరుపేద కుటుంబాల మీద దాడి,అన్యాయం జరిగినప్పుడు ఎమ్మార్పీఎస్ ఆ సందర్భంలో సంఘం దళితులకు న్యాయం జరిగేవిధంగా పని చేస్తుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీలను మొబలై జేషన్ చేసి వారికి కేసులు పైన అవగాహన పెంచి రాజి మార్గంలో చేయాలని ఎస్ఐ సుమతికి తెలిపారు అదేవిధంగా ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు పేట సురేష్ మాట్లాడుతూ మాల మాదిగలకు విద్య ఉద్యోగం పైన అవగాహన తక్కువ విద్యావoతులు కాలేకపోవడం వల్ల వారికి చట్టాలపై అవగాహన తక్కువని కావున చట్టాలపై అవగాహన కల్పించాలని ఎస్సై ని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు యనమల.గంగలప్ప, ఎం ఈ ఎఫ్ నాయకులు టీచర్ బావన్న,ఫీల్డ్ అసిస్టెంట్ నవీన్,మాల మహానాడు మండల అధ్యక్షుడు సలాది.చలపతి,జ్యోతి,నరసమ్మఉపాధ్యక్షుడు పేట.సురేష్ ఉత్తప్ప మరియు రామాంజినేయులు, దొడ్డేప్ప,సుధాకర్,వెంకటరమణా,చినగానపల్లి సూరి శ్రీరాములు,హరీష్, జంపాలసోము టైలర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

