BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 26 August 2026, 08:56 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చక్కెర ధరలకు బ్రేక్.. సామాన్యులకు కేంద్రం తీపి కబురు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Aug, 2026 - 08:56 AM
43 వీక్షణలు

చక్కెర ధరలకు బ్రేక్.. సామాన్యులకు కేంద్రం తీపి కబురు

కిలో రూ.67 నుంచి రూ.55కు పడిపోయిన ఎక్స్‌-మిల్ ధరలు.. మరింత తగ్గే అవకాశం

దేశంలో చక్కెర ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంది. గత కొన్ని రోజులుగా వేగంగా పెరిగిన చక్కెర ధరలకు కేంద్ర చర్యలతో బ్రేక్ పడింది. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల ప్రభావంతో చక్కెర ఎక్స్‌-మిల్ ధరలు ఏకంగా 18 శాతం మేర తగ్గాయి.

మిల్లుల వద్ద విక్రయించే చక్కెర ధర కిలోకు రూ.67 వరకు చేరగా, ప్రస్తుతం అది రూ.55కు దిగివచ్చింది. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని కేంద్ర ఆహార శాఖ స్పష్టం చేసింది.

అకస్మాత్తుగా పెరిగిన ధరలు

గత 15 రోజుల వ్యవధిలో దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు భారీగా పెరిగాయి. మిల్లుల వద్ద ఎక్స్‌-మిల్ ధర రికార్డు స్థాయిలో కిలోకు రూ.67కు చేరింది. కొన్ని చక్కెర మిల్లులు ధరలను ఏకపక్షంగా పెంచడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు.

మిల్లుల వద్ద ధరలు పెరగడంతో దాని ప్రభావం హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లపై పడింది. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడింది.

కేంద్రం రంగంలోకి.. రెండు కీలక నిర్ణయాలు

చక్కెర ధరల పెరుగుదలపై అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. మార్కెట్‌లో సరఫరా కొరత లేకుండా చక్కెర దిగుమతులకు అనుమతులు ఇచ్చింది. విదేశీ చక్కెర అందుబాటులోకి రావడంతో మార్కెట్‌లో సరఫరా పెరిగే పరిస్థితి ఏర్పడింది.

అదే సమయంలో చక్కెర నిల్వలు దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించే వారిపై కూడా నిఘా పెంచింది. అక్రమ నిల్వలు, సట్టేబాజీకి అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు ప్రారంభించింది.

మార్కెట్‌లోకి చేరనున్న ఊరట

కేంద్ర నిర్ణయాల ప్రభావంతో చక్కెర మిల్లులు ధరలను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ.67 ఉన్న ఎక్స్‌-మిల్ ధర రూ.55కు పడిపోయింది. దిగుమతి చేసిన చక్కెర మార్కెట్‌కు చేరడంతో సరఫరా మరింత మెరుగుపడనుంది.

మిల్లుల వద్ద తగ్గిన ధరల ప్రయోజనం త్వరలోనే హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లకు చేరే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో కిరాణా దుకాణాల్లో చక్కెర ధరలు తగ్గి సామాన్యులకు మరింత ఉపశమనం లభించనుంది.