BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 25 August 2026, 04:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అటవీ ప్రాంతంలో భారీగా నక్సల్స్‌ ఆయుధాల పట్టివేత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 04:48 PM
76 వీక్షణలు

అటవీ ప్రాంతంలో భారీగా నక్సల్స్‌ ఆయుధాల పట్టివేత

ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌, తుపాకులు, గ్రెనేడ్లు స్వాధీనం

ఛత్తీస్‌గఢ్‌: భద్రతా బలగాలు నక్సల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ కొట్టాయి. సోమవారం నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

భేజీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భండార్‌పదర్, మునుర్‌కొండ అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా నక్సల్స్‌ దాచిన ఆయుధాలను గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న వాటిలో ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌, 315 బోర్‌ తుపాకీ, మస్కెట్‌ రైఫిల్‌, బీజీఎల్‌ లాంచర్‌, గ్రెనేడ్లు, ఇతర పేలుడు సామగ్రి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఆయుధాల స్వాధీనం నేపథ్యంలో అటవీ ప్రాంతంలో మరింత విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. నక్సల్స్‌ కదలికలపై నిఘా పెంచిన భద్రతా బలగాలు అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నాయి.