BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 25 August 2026, 04:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సాధిక్‌ వేధింపులతో ప్రత్యక్ష నరకం చూశాను..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 04:38 PM
49 వీక్షణలు

సాధిక్‌ వేధింపులతో ప్రత్యక్ష నరకం చూశాను.. సౌజన్య చివరి లేఖలో కన్నీటి వేదన

కుటుంబాన్ని కాపాడుకోవాలనే తపనతో చివరి వరకు పోరాడానని వెల్లడి.. లేఖలో సంచలన ఆరోపణలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి నూకరాజు కుమార్తె సౌజన్య రాసినట్లు చెబుతున్న చివరి లేఖలో పలు సంచలన ఆరోపణలు చేసినట్లు సమాచారం.

చిన్నప్పటి నుంచి తండ్రికి మంచి పేరు తీసుకురావాలనే లక్ష్యంతో చదువుపై శ్రద్ధ పెట్టానని సౌజన్య తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనకు అండగా నిలిచిన సోదరుడు సతీశ్‌ను 2018లో కోల్పోయిన బాధను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.

రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్ కుటుంబ వివరాలను సేకరించి, వ్యక్తిగత విషయాలను తెలుసుకుని తనకు దగ్గరయ్యాడని సౌజన్య ఆరోపించినట్లు తెలుస్తోంది. అనంతరం కొన్ని వ్యక్తిగత విషయాలను అడ్డుపెట్టుకుని తనను బెదిరింపులకు గురిచేశాడని, ఎదిరిస్తే దాడి చేసేవాడని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

తన కుమారుడు రియాన్ష్ భవిష్యత్తు కోసం ఎన్నో బాధలు భరించానని, అతడి భద్రత గురించి నిరంతరం భయపడేదానినని సౌజన్య తెలిపినట్లు తెలుస్తోంది. తన భర్తకు విషయం చెప్పిన సమయంలో ఆయనపై కూడా ఒత్తిడి తెచ్చారని, దీంతో కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురైందని లేఖలో వివరించినట్లు సమాచారం.

రియాన్ష్ చదువుతున్న పాఠశాలలో కోచ్‌గా చేరి తనపై నిఘా పెట్టేవాడని, బాబును కిడ్నాప్ చేస్తానని బెదిరించాడని సౌజన్య ఆరోపించినట్లు తెలుస్తోంది. తన ఫోన్ కాల్స్, కదలికలను నిరంతరం పర్యవేక్షించేవాడని పేర్కొన్నట్లు సమాచారం.

తన భర్త మరణం తర్వాత తనపై మరింత ఒత్తిడి పెరిగిందని, ఇంటి తాళాలు, ఆస్తుల పత్రాల వరకు తన నియంత్రణలోకి తీసుకున్నాడని లేఖలో ఆరోపించినట్లు తెలుస్తోంది. తన కుటుంబ సభ్యుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

తాను లేఖ రాసే సమయంలో భయంతో పెన్ను వణికిందని, తనకు ఏదైనా జరిగితే కుమారుడి పరిస్థితి ఏమవుతుందనే ఆందోళనతో కుటుంబమంతా తీవ్ర నిర్ణయం తీసుకున్నామని సౌజన్య పేర్కొన్నట్లు తెలుస్తోంది.

తనపై మత మార్పిడికి ఒత్తిడి తెచ్చాడని, పుస్తకాలు చదవాలని, నోట్స్ రాయాలని వేధించాడని కూడా లేఖలో ఆరోపించినట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు రోజులలో తీవ్రంగా హింసించాడని, ఉప్పాడ సముద్రం వద్దకు తీసుకెళ్లి బెదిరించాడని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

తన ధర్మాన్ని, నమ్మకాలను చివరి వరకు వదలలేదని సౌజన్య ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది.