BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం
Date of Publish : 24 August 2026, 09:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం.. 15 విమానాల దారి మళ్లింపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 09:18 PM
75 వీక్షణలు

ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం.. 15 విమానాల దారి మళ్లింపు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ విమానాశ్రయానికి రావాల్సిన 15 విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. 

దారి మళ్లించిన విమానాల్లో 12 విమానాలను జైపూర్‌కు, రెండు విమానాలను చండీగఢ్‌కు, ఒక విమానాన్ని లక్నోకు పంపించారు. వర్షం, తక్కువ దృశ్యమానత కారణంగా టేకాఫ్, ల్యాండింగ్‌లపై ప్రభావం పడటంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 

భారీ వర్షాలతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది.

విమాన ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను ముందుగా పరిశీలించుకుని విమానాశ్రయానికి చేరుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి.