BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 26 August 2026, 08:50 am
Posted by : కూనురు మధు

చిట్యాల టీటీడీ కళ్యాణ మండపం భూమిపై డిజిటల్‌ సర్వే పూర్తి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 Aug, 2026 - 08:50 AM
230 వీక్షణలు

చిట్యాల టీటీడీ కళ్యాణ మండపం భూమిపై డిజిటల్‌ సర్వే పూర్తి

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కోసం 2002లో కేటాయించిన భూమిపై డిజిటల్‌ సర్వే ప్రక్రియ పూర్తయింది. ఎమ్మార్వో విజయ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గురులింగం ఆధ్వర్యంలో సర్వే అధికారులు మంగళవారం భూమిని డిజిటల్‌ పద్ధతిలో సర్వే చేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు గతంలో టీటీడీ కళ్యాణ మండపం కోసం కేటాయించిన 1 ఎకరం 12 గుంటల భూమిపై శనివారం ప్రాథమిక సర్వే నిర్వహించినట్లు ఎమ్మార్వో విజయ్‌కుమార్‌ తెలిపారు. అగ్రిమెంట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం భూమి విస్తీర్ణం 1 ఎకరం 12 గుంటలుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. సర్వేయర్‌ పూర్తి నివేదిక అందిన అనంతరం సంబంధిత రికార్డులను పరిశీలించి భూమి హద్దులను అధికారికంగా నిర్ధారిస్తామని ఎమ్మార్వో పేర్కొన్నారు. అనంతరం పూర్తి సర్వే నివేదికను శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంకు అందజేస్తామని తెలిపారు. ఈ సర్వే కార్యక్రమంలో ఆర్‌ఐ జానీ షరీఫ్‌, సర్వేయర్‌ రజనీకాంత్‌, జీపీఓ రెహమాన్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.