BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 26 August 2026, 08:49 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బీజేపీ జిల్లా కార్యదర్శి నానబాల కుమార్ డిమాండ్....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Aug, 2026 - 08:49 AM
52 వీక్షణలు

బీజేపీ జిల్లా కార్యదర్శి నానబాల కుమార్ డిమాండ్....

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

ఏఈ నూకరాజు ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఖాన్ న్ను తక్షణమే అరెస్టు చేయాలి

 వుంగనూరు మంగళవారం ఆగష్టు 25 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా విధులు నిర్వర్తిస్తున్న నూకరాజు ఆత్మహత్య సంఘటన అత్యంత విచారకరమని, ఈ దారుణానికి ప్రధాన కారణమైన సాదిక్ ఖాన్పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపి జిల్లా కార్యదర్శి నానబాల సుగుణ సుందరి కుమార్, మరియు బీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు బాధితుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలం మరియు ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ ఆత్మహత్య వెనుక సాదిక్ ఖాన్ తీవ్రమైన వేధింపులు ఉన్నాయని ఆరోపించారు. మైనారిటీ మోర్చా నాయకుడు అయూబ్ ఖాన్ మాట్లాడుతూ మతమార్పిడి ఒత్తిడి మానసిక వేధింపులు తోనే నూకరాజు ను ఇస్లాం

మతంలోకి మారాలని సాదిక్ ఖాన్ తీవ్రంగా ఒత్తిడి చేస్తూ, మానసికంగా దారుణంగా వేధించాడని తెలిపారు. ఈ మతమార్పిడి ఒత్తిడి మోసం మరియు అక్రమాలని ఎస్ సి మోర్చా నాయకుడు నరసింహులు ఆరోపించారు. మతం ముసుగులో సాదిక్ ఖాన్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని, శిక్షణ పేరుతో చాలామంది పిల్లలను క్రూరంగా కొడుతూ, మోసాలకు దోపిడీలకు దోపిడీకి పాల్పడుతున్నాడని తీవ్ర ఆరోపణ చేశారు. ఈ సంఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర హోం మంత్రి గారు

మరియు రాష్ట్ర డిజిపి ప్రత్యేక దృష్టి సారించి, సమగ్రమైన పారదర్శకమైన విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు, నూకరాజు ఆత్మహత్యకు ప్రేరేపించిన సాదిక్ ఖాన్పై సంబంధిత చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలి. నూకరాజు ? కుటుంబానికి న్యాయం చేయాలి అతని కుటుంబానికి తగిన ఆర్థిక సాయం చేస్తూ భద్రత, కల్పించాలని కోరారు. ఒక నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగిని ఈ స్థాయికి వేధించి ప్రాణాలు తీసుకునేలా చేయడం అత్యంత హేయమైన చర్య అని, పోలీసు శాఖ వారు ఈ విషయమై తక్షణమే స్పందించి నిందితుడిని కఠినంగా శిక్షించే విధంగా కేసు నమోదు చేయాలని పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు కు ఫిర్యాదు చేశారు, ఈ కార్యక్రమం లో నానబాల కుమార్. కుమార్, రామకృష్ణ, నరసింహులు. నాగరాజా. సూరి ఆయుబుఖాన్.  తదితరులు పాల్గొన్నారు.