BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 26 August 2026, 10:34 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను లో ఘనంగా మదర్ థెరిసా 116వ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Aug, 2026 - 10:34 AM
96 వీక్షణలు

పెనుగొలను లో ఘనంగా మదర్ థెరిసా 116వ జయంతి వేడుకలు

మానవ సేవే మాధవ సేవగా నిలిచిన మహనీయురాలు మదర్ థెరిసా: వక్తలు

పెనుగొలను, ఆగస్టు 26:

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మానవతావాది మదర్ థెరిసా 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మదర్ థెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మదర్ థెరిసా పేదలు, అనాథలు, రోగులు, నిరుపేదల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతా మూర్తి అని కొనియాడారు. 1910 ఆగస్టు 26న ప్రస్తుత ఉత్తర మాసిడోనియా దేశంలోని స్కోప్లే నగరంలో జన్మించిన ఆమె చిన్ననాటి నుంచే సేవా భావాన్ని అలవర్చుకున్నారని తెలిపారు.

తండ్రి మరణం అనంతరం చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షితురాలైన మదర్ థెరిసా 18 సంవత్సరాల వయసులో ఇంటిని విడిచి సిస్టర్ ఆఫ్ లోరెటో సంఘంలో చేరారని వివరించారు. అనంతరం ఐర్లాండ్ వెళ్లి ఆంగ్ల భాషను అభ్యసించి, 1929లో భారతదేశంలోని డార్జిలింగ్‌కు వచ్చారని పేర్కొన్నారు.

1931 మే 24న తొలి సన్యాస ప్రమాణం చేసిన ఆమె కలకత్తాలోని లోరెటో కాన్వెంట్ పాఠశాలలో దాదాపు 17 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలిగా సేవలందించారని తెలిపారు. 1948లో భారత పౌరసత్వం స్వీకరించిన మదర్ థెరిసా 1950 అక్టోబర్ 7న కలకత్తాలో పేదలు, రోగుల సేవ కోసం "మిషనరీస్ ఆఫ్ ఛారిటీ" సంస్థను స్థాపించారని వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించిన మదర్ థెరిసా చివరి దశలో ఉన్నవారికి, అనాథలకు, నిరుపేదలకు అండగా నిలిచి మానవతకు ప్రతీకగా నిలిచారని అన్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా 1979లో నోబెల్ శాంతి బహుమతి, 1980 జనవరి 25న భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించాయని తెలిపారు.

అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, సాయిబాబా యువజన కమిటీ అధ్యక్షులు వూటుకూరు యజ్ఞ కృష్ణ, బొంత వెంకట నారాయణ, పొనుగుపాటి కిట్టయ్య, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.