BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 03:49 pm
Posted by : SEETHA KIRAN KUMAR

11 బ్యాక్‌లాగ్స్‌.. బీటెక్‌ చదువు ఒత్తిడితో విద్యార్థి మృతి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
17 Nov, 2026 - 03:49 PM
15 వీక్షణలు

తల్లిదండ్రులు, సోదరికి వాట్సాప్‌ సందేశం.. ఫోన్‌లో మాట్లాడుతుండగానే హాస్టల్‌ పై అంతస్తు నుంచి దూకిన విద్యార్థి

బీటెక్‌ చదువులో ఎదురవుతున్న ఇబ్బందులు, పరీక్షల్లో బ్యాక్‌లాగ్స్‌ కారణంగా ఒత్తిడికి గురైన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మంకు చెందిన విక్రమ్‌బాబు (19) మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతనికి 11 బ్యాక్‌లాగ్స్‌ ఉండటంతో చదువు కొనసాగించడం తన వల్ల కావడం లేదని తల్లిదండ్రులు, సోదరికి వాట్సాప్‌ సందేశం పంపినట్లు సమాచారం.

అనంతరం కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతుండగానే హాస్టల్‌ పై అంతస్తు నుంచి కిందకు దూకినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థి మృతి చెందాడు.

ఈ ఘటనతో విద్యార్థి కుటుంబంలో విషాదం నెలకొంది. విద్యా ఒత్తిడి, పరీక్షల్లో వైఫల్యాలు ఎదురైనప్పుడు విద్యార్థులు ఒంటరిగా ఆందోళన చెందకుండా కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం ముఖ్యం.