BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 07:12 pm
Posted by : K MAHESH

దాత్‌పల్లి గ్రామానికి 16 నూతన ఆసరా పింఛన్లు మంజూరు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 07:12 PM
22 వీక్షణలు

లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన కాంగ్రెస్ నాయకులు

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: నర్సింగ్ వెంకటరమణ గౌడ్, పాలకుర్ల శేఖర్ గౌడ్

రంగారెడ్డి జిల్లా | ఇబ్రహీంపట్నం | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

మంచాల మండలంలోని దాత్‌పల్లి గ్రామానికి నూతనంగా 16 ఆసరా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నర్సింగ్ వెంకటరమణ గౌడ్, పాలకుర్ల శేఖర్ గౌడ్, సీనియర్ నాయకుడు జాటోత్ రాజు నాయక్ కలిసి లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో గ్రామానికి నూతన ఆసరా పింఛన్లు మంజూరు కావడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని అర్హులైన పేద కుటుంబాలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు హీరా నాయక్, నాయకులు సిద్ధగోని దేవేందర్ గౌడ్, రాజేందర్, రవి, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.