BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 19 May 2026, 08:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

175 నియోజకవర్గాల్లో ఆర్‌పీసీ కీలక నియామకాలు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 May, 2026 - 08:50 PM
187 వీక్షణలు

175 నియోజకవర్గాల్లో ఆర్‌పీసీ కీలక నియామకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(ఆర్‌పీసీ) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కీలక నియామకాలను వేగవంతం చేసింది. “ఓటు ఇవ్వండి...సంపద ఇస్తాం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న పార్టీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కో-ఆర్డినేటర్ల నియామక ప్రక్రియను ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాష్ట్ర కో-ఆర్డినేటర్ పంగులూరి బుచ్చిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. కొమ్మోజు రమేష్ సంయుక్తంగా పలు నియామకాలను ప్రకటించారు. సాల మల్లిఖార్జున రావును ప్రత్తిపాడు నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా, గంట శ్రీరామ కోటేశ్వరరావును కొవ్వూరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా, దొడ్డి సుధాకర్ రాజును పోలవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా నియమితులైన కో-ఆర్డినేటర్లు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడమే లక్ష్యమని పార్టీ నాయకత్వం పేర్కొంది. ప్రజా సమస్యల పరిష్కారం, యువతకు రాజకీయ అవకాశాలు, సామాజిక న్యాయం ప్రధాన అజెండాలుగా పార్టీ ముందుకు సాగుతోందని వెల్లడించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమైందని, అదే లక్ష్యంతో పార్టీ పనిచేస్తోందన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్ర కో-ఆర్డినేటర్ పంగులూరి బుచ్చిబాబు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కో-ఆర్డినేటర్లపై ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కమిటీల ఏర్పాటు, యువతను రాజకీయాల్లోకి తీసుకురావడం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడం త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. కొమ్మోజు రమేష్ మాట్లాడుతూ సామాజిక బాధ్యత కలిగిన యువత, మేధావులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పార్టీతో కలవాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావడమే పార్టీ లక్ష్యమన్నారు. నూతనంగా నియమితులైన కో-ఆర్డినేటర్లు మాట్లాడుతూ పార్టీ నాయకత్వం తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజల మధ్య ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై అవగాహన సదస్సులు, సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. సామాజిక దృక్పథం కలిగిన యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకత్వం పేర్కొంది. 2029 ఎన్నికల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా నిలిచి రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించడమే లక్ష్యమని స్పష్టం చేసింది.