BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 04 July 2026, 09:52 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో పింగళి వెంకయ్య వర్ధంతి ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 09:52 AM
193 వీక్షణలు

జులై 4: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను జిల్లా పరిషత్ హైస్కూల్‌లో భారత జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడని, వందేమాతరం, హోం రూల్, ఆంధ్ర ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశానికి ఒక ప్రత్యేక జాతీయ జెండా ఉండాలనే సంకల్పంతో 1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించారని పేర్కొన్నారు.

సూచనల మేరకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో రాట్నం గుర్తుతో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారని చెప్పారు. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో గాంధీ ఈ పతాకాన్ని ఎగురవేశారని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాట్నం స్థానంలో అశోక చక్రాన్ని చేర్చారని వివరించారు.

ఇలాంటి గొప్ప జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగు వాడు కావడం ప్రతి తెలుగువారికీ గర్వకారణమని ఆయన అన్నారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.