BREAKING
thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు
Date of Publish : 02 August 2026, 11:23 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 11:23 AM
58 వీక్షణలు

18 యూనివర్శిటీల పాలక మండళ్లపై జగన్ హయాం నియామకాలకు చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

అమరావతి: రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ (పాలక మండళ్లు)ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా వ్యవస్థలో పరిపాలనా మార్పులకు శ్రీకారం చుడుతూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ, విద్యా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గత ప్రభుత్వం 2023 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మూడేళ్ల కాలానికి ఈ పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం క్లాజ్-1 కింద పదవిరీత్యా సభ్యులుగా కొనసాగుతున్న అధికారులు యథావిధిగా కొనసాగనున్నారు. అయితే క్లాజ్-2 కింద ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యుల నియామకాలను రద్దు చేసింది.

అదే సమయంలో కొన్ని విశ్వవిద్యాలయాలకు కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశ్వవిద్యాలయాల పరిపాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ నిర్ణయంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నామినేషన్లకు తెరపడగా, కొత్త పాలక మండళ్ల ఏర్పాటుతో ఉన్నత విద్యా సంస్థల పరిపాలనలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యావేత్తలు, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. కొత్త పాలక మండళ్ల నియామకాలపై త్వరలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.