20 నిమిషాల్లో రూ.10 లక్షల ఆభరణాల రికవరీ..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
20 నిమిషాల్లో రూ.10 లక్షల ఆభరణాల రికవరీ.. రాయచోటి పోలీసులకు ఎస్పీ అభినందనలు!...
అన్నమయ్య జిల్లా
రాయచోటి.
రాయచోటికి చెందిన షేక్ మెహరాజ్ ఆటోలో మరిచిపోయిన రూ.10 లక్షల విలువైన (6 తులాల బంగారం, 30 తులాల వెండి) బ్యాగ్‌ను అర్బన్ పోలీసులు సీసీటీవీల సాయంతో కేవలం 20 నిమిషాల్లోనే కనుగొన్నారు.
రికవరీ చేసిన ఈ ఆభరణాలను ఇన్‌స్పెక్టర్ బి.వి.చలపతి, ఎస్‌ఐ విష్ణువర్ధన్ తక్షణమే బాధితురాలికి సురక్షితంగా అప్పగించారు.
సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి మెరుపు వేగంతో స్పందించిన రాయచోటి పట్టణ పోలీసులను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,. ప్రత్యేకంగా అభినందించారు.