BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 21 May 2026, 10:21 pm
Posted by : V శ్రీనివాస్

2028లో బీజేపీ అధికారమే లక్ష్యం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 May, 2026 - 10:21 PM
209 వీక్షణలు

2028లో బీజేపీ అధికారమే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే యెండల

​మంచిర్యాల : వచ్చే 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగిన కార్యకర్తల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను బూత్ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారానే పార్టీని బలోపేతం చేయవచ్చని, రాబోయే ఎన్నికలకు క్యాడర్‌ను సన్నద్ధం చేయడానికే ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లితో పాటు ముఖ్య నాయకులు కన్నం యుగదీశ్వర్, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు