BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 06 July 2026, 06:03 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో యూరియా కొరత లేదు.. 3.39 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 06:03 AM
110 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 3.39 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటివరకు 2.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్‌కు రైతుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 17.70 లక్షల మంది రైతులు యాప్ ద్వారా 59.78 లక్షల యూరియా బ్యాగులు బుక్ చేసుకోగా, వాటిలో ఇప్పటికే 52.86 లక్షల బ్యాగులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్న మంత్రి, యూరియా పంపిణీలో పారదర్శకత కోసం రూపొందించిన ఈ యాప్‌కు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఎరువుల లభ్యతపై ఎలాంటి సందిగ్ధత లేకుండా ఉండేందుకు వ్యవసాయశాఖ ప్రతిరోజూ జిల్లాల వారీగా యూరియా నిల్వలు, అమ్మకాలు, కొనుగోలు, అందుబాటు వివరాలతో బులెటిన్లు విడుదల చేస్తోందని చెప్పారు.

ఫెర్టిలైజర్ యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, ఒకే వ్యక్తి పలుమార్లు యూరియా కొనుగోలు చేయడం, ఎరువులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం వంటి అక్రమాలకు గట్టి అడ్డుకట్ట పడిందని మంత్రి తెలిపారు. ప్రతి యూరియా బ్యాగు కదలికపై ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోందని, ఏ డీలర్ వద్ద ఎంత నిల్వ ఉంది, ఎంత విక్రయమైంది, ఎంత మిగిలి ఉందనే సమాచారం క్షణాల్లో అందుబాటులోకి వస్తోందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 68 వేల మంది రైతులు యూరియాను బుక్ చేసుకున్నారని చెప్పారు. వారు 4.69 లక్షల యూరియా బ్యాగులు బుక్ చేసుకోగా, అందులో 3.38 లక్షల బ్యాగులను ఇప్పటికే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. డిజిటల్ విధానాన్ని రైతులు వేగంగా స్వీకరిస్తున్నారనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని అన్నారు.

శాటిలైట్ ఆధారిత మట్టి పరీక్షలకు ప్రయోగాలు

శాటిలైట్ ఆధారిత మట్టి పరీక్షలపై వ్యవసాయశాఖ విస్తృత స్థాయిలో ప్రయోగాలు నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా లభిస్తున్న సమాచారాన్ని ప్రయోగశాలల్లో నిర్వహిస్తున్న మట్టి పరీక్షల నివేదికలతో సరిపోల్చి ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తున్నామని చెప్పారు.

ఈ ప్రక్రియ విజయవంతమైతే రైతులకు తక్కువ సమయంలోనే భూసార వివరాలు, పోషక లోపాలు, అవసరమైన ఎరువులపై శాస్త్రీయ సూచనలు అందించగలమన్నారు. వ్యవసాయ రంగంలో మరిన్ని ఐటీ ఆధారిత ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని, పంటల పర్యవేక్షణ, భూసార నిర్వహణ, ఎరువుల పంపిణీ, వాతావరణ సమాచార సేవలు, వ్యవసాయ సలహాలను మరింత ఆధునికంగా అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.