BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 12:20 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

సర్పంచ్ అభ్యర్థులకు 25 గుర్తులు.. వార్డు సభ్యులకు 20 గుర్తులు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
09 Nov, 2026 - 12:20 PM
28 వీక్షణలు

నోటా కూడా ఏర్పాటు.. అభ్యర్థుల సంఖ్య పెరిగితే అదనపు గుర్తుల కేటాయింపు

తెలంగాణ (ఎన్ టుడే న్యూస్): రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అభ్యర్థుల గుర్తుల కేటాయింపుపై వివరాలు వెల్లడయ్యాయి. ఈ నెల 26, 29 తేదీలతో పాటు డిసెంబర్ 2న మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థుల కోసం 25 గుర్తులు, వార్డు సభ్యుల అభ్యర్థుల కోసం 20 గుర్తులను కేటాయించారు. వీటితో పాటు ఓటర్లకు నోటా (NOTA) ఎంపిక కూడా అందుబాటులో ఉండనుంది.

అభ్యర్థులు తమ ప్రచారంలో ఓటర్లకు గుర్తుండేలా కేటాయించిన గుర్తులను ఉపయోగించుకోవచ్చు. ఒక గ్రామ పంచాయతీలో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య అందుబాటులో ఉన్న గుర్తుల కంటే ఎక్కువగా ఉంటే, అవసరాన్ని బట్టి అదనపు గుర్తులను కేటాయించనున్నారు.

సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన 25 గుర్తులు:

  1. మంచం

  2. కత్తెర

  3. ఉంగరం

  4. బుట్ట

  5. వంకాయ

  6. కప్పు, సాసరు

  7. క్యారెట్

  8. తాళం చెవి

  9. గొలుసు

  10. కుర్చీ

  11. బ్యాట్

  12. టెలిఫోన్

  13. బల్ల

  14. మొక్కజొన్న

  15. పలక

  16. ద్రాక్షపళ్లు

  17. తిరగలి

  18. కుండ

  19. అరటిపండు

  20. కొవ్వొత్తులు

  21. నల్లబోర్డు

  22. అనాసపండు

  23. షటిల్

  24. చేతికర్ర

  25. చెంచా

వార్డు సభ్యుల అభ్యర్థులకు కేటాయించిన 20 గుర్తులు:

  1. ప్రెషర్ కుక్కర్

  2. గౌను

  3. స్టూల్

  4. ఇస్త్రీ పెట్టె

  5. పోస్టు డబ్బా

  6. గ్యాస్ స్టౌ

  7. బీరువా

  8. ఐస్‌క్రీమ్

  9. కెటిల్

  10. కటింగ్ ప్లేయర్

  11. విద్యుత్ స్తంభం

  12. గరాటా

  13. డిష్ యాంటెన్నా

  14. రంపం

  15. కెమెరా

  16. క్యారమ్ బోర్డు

  17. వయోలిన్

  18. బెండకాయ

  19. బెల్టు

  20. కోటు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులకు ఈ గుర్తులు కేటాయించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థుల సంఖ్యను బట్టి అదనపు గుర్తుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.