BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 05:27 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్ తూర్పులో కొత్తగా 2,740 మందికి చేయూత పెన్షన్లు మంజూరు

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
17 Nov, 2026 - 05:27 PM
19 వీక్షణలు

నెలకు రూ.69.89 లక్షల ఆర్థిక భరోసా.. ఈ నెల 19న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ

వరంగల్ | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొత్తగా 2,740 మందికి చేయూత పెన్షన్లు మంజూరైనట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ వెల్లడించారు. ఇప్పటికే నియోజకవర్గంలో 35,716 మంది పెన్షన్లు పొందుతుండగా, తాజాగా మంజూరైన పెన్షన్లతో మరింత మంది లబ్ధిదారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందనుంది.

కొత్తగా పెన్షన్లు మంజూరైన వారిలో 733 మంది దివ్యాంగులు, 1,704 మంది వితంతువులు ఉన్నట్లు కొండా సురేఖ తెలిపారు. ఈ పెన్షన్ల ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.69.89 లక్షల మేర ఆర్థిక భరోసా లభించనుందని పేర్కొన్నారు.

ఈ నెల 19న కొత్తగా ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.