BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 30 June 2026, 01:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Penugolanu: 32 ఏళ్ల సేవలకు రాయల నాగేశ్వరరావుకు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 01:21 PM
319 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా | NTODAY NEWS

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను ప్రాథమిక సహకార సంఘంలో స్టాఫ్ అసిస్టెంట్‌గా 32 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించి మంగళవారం పదవీ విరమణ పొందిన రాయల నాగేశ్వరరావును శిరిడి సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

సొసైటీ కార్యాలయం వద్ద నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు రాయల నాగేశ్వరరావుకు శాలువా కప్పి, జ్ఞాపికలు అందజేసి ఆయన సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా సహకార సంఘం అధ్యక్షుడు నాగళ్ళ మురళి మాట్లాడుతూ, నాగేశ్వరరావు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ రైతుల విశ్వాసాన్ని, అభిమానాన్ని సంపాదించుకున్నారని ప్రశంసించారు. విశ్రాంత బ్యాంకు మేనేజర్ దేవరపల్లి రమేష్ మాట్లాడుతూ, ఆయన సహకార రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సహకార సంఘం సీఈఓ నామా నరసింహారావు, మాజీ అధ్యక్షుడు కోట నాగేశ్వరరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బొలగాని కోటేశ్వరరావు, శిరిడి సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, మెట్టగుట్ట దేవస్థానం అధ్యక్షుడు పంది వెంకట్రావు, టీడీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు, యనమద్ది విజయ్ కుమార్, కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు, సహకార సంఘ ఉద్యోగులు, రైతులు, గ్రామస్తులు పాల్గొని నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు.