BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 30 June 2026, 03:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బీఎల్ఓలుగా పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు ఊరట.. కేంద్రాల పని వేళల్లో మార్పు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 03:16 PM
116 వీక్షణలు

అమరావతి: రాష్ట్రంలో బీఎల్ఓలుగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఊరట కల్పించింది. వారి పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాల పని వేళల్లో తాత్కాలిక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, బీఎల్ఓలుగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్న కేంద్రాలు జూన్ 29 నుంచి జూలై 28 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నాయి. ఈ మార్పు కేవలం ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అంగన్వాడీ వర్కర్లు పనిచేస్తున్న కేంద్రాలకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

అదేవిధంగా, అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందించే పౌష్టికాహార పంపిణీ, ఇతర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎన్నికల విధులు, అంగన్వాడీ సేవలు రెండూ సమన్వయంతో కొనసాగేందుకు అవకాశం ఏర్పడనుంది.