BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 19 August 2025, 08:00 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

గత ఐదేళ్లలో ఏపీ బ్యాంకుల్లో 341 సైబర్‌ మోసాలు

తెలంగాణ
19 Aug, 2025 - 08:00 PM
328 వీక్షణలు
‎గత ఐదేళ్లలో ఏపీ బ్యాంకుల్లో 341 సైబర్‌ మోసాలు NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర కళ్యాణ్ కుమార్ .. ఏపీలో 2024లో 82 సైబర్‌ బ్యాంకింగ్‌ మోసాలు .. బ్యాంకు లావాదేవీలకు సైబర్‌ సెక్యూరిటీ ఏర్పాట్లు .. డిజిటల్ చెల్లింపులపై RBI మాస్టర్ డైరెక్షన్ .. CERT-In ఎంప్యానెల్డ్ ఆడిటింగ్ సంస్థలతో పర్యవేక్షణ .. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం. ఏలూరు, అగస్టు 18: 2020 నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బ్యాంకింగ్‌ రంగంలో సైబర్‌ నేరాల సంఖ్య భారీగా పెరిగిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ అడిగిన ప్రశ్నకు లోక్‌ సభలో కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. సైబర్ భద్రతకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు చెందిన సైబర్ సెక్యూరిటీ & ఐటీ రిస్క్ గ్రూప్ (CSITE) నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని, సైబర్ భద్రతా చట్రాన్ని బలోపేతం చేయడానికి వివిధ సర్క్యులర్‌లు/ మార్గదర్శకాలను ఆర్బీఐ జారీ చేస్తోందని మంత్రి తెలిపారు. ఎంప్యానెల్ చేయబడిన 200 సంస్థల ద్వారా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) భారతీయ బ్యాంకింగ్ రంగంలోని వివిధ సంస్థల కంప్యూటర్ సిస్టమ్‌లు, నెట్‌వర్క్‌లు, వెబ్‌సైట్‌లు, క్లౌడ్ అప్లికేషన్‌లను నిరంతరం ఆడిటింగ్‌ చేస్తోందని, ఈ సంస్థలు గత ఐదేళ్లలో 29,751 ఆడిట్‌లను నిర్వహించాయని, ఏమైనా లోపాలు గమనిస్తే వెంటనే సంబంధిత బ్యాంకులకు తెలియచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి గత ఐదేళ్లలో జరిగిన బ్యాంకు సైబర్‌ మోసాలను పరిశీలిస్తే 2020 లో 36, 2021 లో 59, 2022లో 98, 2023లో 66, 2024లో 82 సైబర్‌ నేరాలు నమోదవ్వగా, ఈ ఐదేళ్లలో ఖాతాదారులు నష్టపోయిన మొత్తం విలువ 132.97 కోట్లు అని కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి వివరించారు. Follow us on Website Facebook Instagram YouTube ‎