BREAKING
thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
Date of Publish : 23 June 2026, 11:47 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యోగా డే కోసం కోట్లు.. పేదల కోసం ఎందుకు కాదు?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 11:47 AM
108 వీక్షణలు

దేశంలో ఆకలి బాధతో అలమటిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తిండికి, ఉపాధికి, కనీస అవసరాలకు నోచుకోని ప్రజలు కష్టాల్లో జీవిస్తుంటే, యోగా దినోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఆసనాలు వేయాలంటే ముందుగా ఆకలి తీరాలి. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ భద్రత ఉండాలి. చట్టప్రకారం వేతనాలు అందాలి. నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండాలి. దోపిడీని అరికట్టాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి.

ఆకలి, నిరుద్యోగం, పేదరికం వంటి మౌలిక సమస్యలు అలాగే ఉండగా, భారీ ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంపై దృష్టి పెట్టకుండా, ఆర్భాట కార్యక్రమాలతో అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"ప్రజల కడుపు నిండితేనే ఆరోగ్యం, ఆ తర్వాతే యోగా" అని పలువురు సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యోగా ఆరోగ్యానికి మంచిదే అయినా, ఆకలి తీర్చడం, ఉపాధి కల్పించడం, జీవన భద్రత కల్పించడం ప్రభుత్వాల తొలి బాధ్యత అని వారు పేర్కొంటున్నారు.