BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 15 September 2026, 09:09 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బేగంబజార్‌లో 48 కిలోల బంగారు గణేశుడు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
15 Sep, 2026 - 09:09 PM
8 వీక్షణలు

24 క్యారెట్ల బంగారు పూత.. 3.83 లక్షల అమెరికన్ డైమండ్స్‌తో ప్రత్యేక ఆకర్షణ

హైదరాబాద్ | Ntoday News

వినాయక చవితి వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌ బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గణేశ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 48 కిలోల బరువున్న ఈ విగ్రహానికి 24 క్యారెట్ల బంగారు పూతతో పాటు 3,83,800 అమెరికన్ డైమండ్స్తో అలంకరణ చేశారు. 

‘లీ-చీ కా రాజా’గా ప్రసిద్ధి చెందిన ఈ గణనాథుడిని అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారులు రూపొందించారు. సుమారు ఎనిమిది మంది కళాకారులు ఎనిమిది నెలల పాటు శ్రమించి విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు తెలిపారు. ఒక్కో రాయిని ప్రత్యేకంగా అమర్చినట్లు వెల్లడించారు. 

ఈ విగ్రహ రూపకల్పనలో ముంబైలోని లాల్‌బాగ్చా రాజాతో పాటు తిరుపతి బాలాజీ రూపాల నుంచి స్ఫూర్తి తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వెనుక భాగంలో దశావతారాల రూపకల్పనతో పాటు పైభాగంలో బాలాజీ రూపం, ఇరువైపులా లక్ష్మీదేవి, సరస్వతి రూపాలను పొందుపరిచారు. 

బంగారు పూత, వేలాది మెరుస్తున్న అమెరికన్ డైమండ్స్‌తో ప్రత్యేకంగా రూపొందించిన ఈ విగ్రహం బేగంబజార్‌లో వినాయక చవితి వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.