BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 July 2026, 12:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

6 ఏళ్ల చిన్నారి కోసం ప్రకాశం పోలీసుల ముమ్మర గాలింపు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 12:43 PM
104 వీక్షణలు

ప్రకాశం జిల్లాలో అదృశ్యమైన 6 ఏళ్ల చిన్నారి రిచర్డ్ రేయాన్స్ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారిని గుర్తించేందుకు 20 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.

జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంఘటన స్థలాన్ని సందర్శించి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దర్యాప్తు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.

చిన్నారి ఆచూకీ కోసం డ్రోన్లు, డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరా దృశ్యాలు వినియోగిస్తూ ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. అవసరమైన సమాచారం కోసం పొరుగు జిల్లాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.

ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, చిన్నారిని క్షేమంగా గుర్తించేందుకు పోలీసులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.