BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 July 2026, 12:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యుత్ సంస్థలపై ప్రయివేటు నీడ.. తెలంగాణలో ఆందోళనలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 12:43 PM
138 వీక్షణలు

యాదాద్రి ప్లాంట్ కీలక విభాగాల అప్పగింతపై విమర్శలు.. 2025 విద్యుత్ సవరణ బిల్లుతో పూర్తి ప్రయివేటీకరణకు మార్గమంటూ ఉద్యోగ సంఘాల హెచ్చరిక

తెలంగాణలో ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలపై ప్రయివేటీకరణ ప్రభావం మరింత స్పష్టమవుతోందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని కీలక విభాగాలను ప్రయివేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియ, 'రైతు డిస్కం' ఏర్పాటు ప్రయత్నాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2025 విద్యుత్ సవరణ బిల్లు కలిసి విద్యుత్ రంగ భవిష్యత్తుపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని పేర్కొంటున్నాయి.

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్-1, స్టేజ్-2 యూనిట్లలో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ పనులను ప్రయివేటు సంస్థలకు అప్పగించేందుకు జెన్‌కో టెండర్లు ఆహ్వానించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో 'రైతు డిస్కం' ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియలు కూడా వేగంగా సాగుతున్నాయి.

ఈ పరిణామాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్లు సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు కొనసాగితేనే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

సుమారు రూ.30–35 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభమై ఏడాది కూడా పూర్తికాకముందే కీలక విభాగాలను ప్రయివేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు ప్రారంభమవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేదని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగ సంఘాల అభిప్రాయం ప్రకారం, 2025 విద్యుత్ సవరణ బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ప్రయివేటు సంస్థలకు మరింత అవకాశం లభించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ విద్యుత్ నెట్‌వర్క్‌ను ప్రయివేటు సంస్థలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించడం, భవిష్యత్తులో సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

ప్రయివేటీకరణ విధానాలను అడ్డుకోకపోతే ప్రభుత్వ విద్యుత్ సంస్థలు బలహీనపడటంతో పాటు భవిష్యత్తులో విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడే ప్రమాదం ఉందని విద్యుత్ ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.