BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

చనుబండలో వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 12:43 PM
101 వీక్షణలు

చాట్రాయి మండలం, చనుబండ: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చనుబండ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వనమా వాసు మాట్లాడుతూ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి పేద ప్రజల సంక్షేమాన్ని తన పాలనకు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న మహానేత అని కొనియాడారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, నిరుపేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు.

వైఎస్సార్ ఆశయాలు, సంక్షేమ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి ప్రజలకు అండగా నిలవాలని, వైఎస్సార్ చూపిన మార్గమే సమాజ అభివృద్ధికి ఆదర్శమని పేర్కొన్నారు.

అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ, వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.