BREAKING
thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 16 August 2026, 08:17 pm
Posted by : ఈడూరి డేవిడ్

యర్నగూడెంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
16 Aug, 2026 - 08:17 PM
69 వీక్షణలు

యర్నగూడెంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

యర్నగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కే. కమల్ రాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు.

అదేవిధంగా వేణుగోపాల సొసైటీ, శాఖా గ్రంథాలయం, పార్డ్ ఇండియా సంస్థ ప్రధాన కార్యాలయం, 3ఎఫ్ ఆయిల్ ఫ్యాక్టరీ, జడ్పీ హైస్కూల్, మెయిన్ ఎలిమెంటరీ, స్పెషల్ ఎలిమెంటరీ పాఠశాలలు, సెయింట్ జోసెఫ్, ట్రూలైట్ పాఠశాలలు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, ప్రభుత్వ హాస్టళ్లు తదితర ప్రాంతాల్లో జాతీయ జెండాకు వందనం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, పార్డ్ ఇండియా సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడంతో యర్నగూడెంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి వాతావరణంలో ఘనంగా జరిగాయి.