BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 12 January 2026, 08:09 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్‌కు ఘన నివాళి

తెలంగాణ
12 Jan, 2026 - 08:09 AM
386 వీక్షణలు

అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్‌కు ఘన నివాళి

జగిత్యాలలో అలిశెట్టి జయంతి, వర్ధంతి వేడుకలు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ NTODAY NEWS: గొల్లపల్లి న్యూస్ రిపోర్టర్ తెలంగాణ అక్షర సూర్యుడు, జగిత్యాల ముద్దుబిడ్డ అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్ధంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని అంగడి బజార్ కూడలిలో ఉన్న అలిశెట్టి ప్రభాకర్ విగ్రహానికి జిల్లా తొలి జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, సామాన్యుడి కష్టాలను, సమాజంలోని అసమానతలను తన కలంతో ఎండగట్టిన ధీశాలి అలిశెట్టి ప్రభాకర్ అని అన్నారు. “మరణం నా చివరి చరణం కాదు” అని చాటిచెప్పిన ఆయన కవిత్వం నేటికీ అనేక మందికి స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. జగిత్యాల గడ్డపై పుట్టి తన అక్షరాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాలకు గర్వకారణమని తెలిపారు. పాల్గొన్న ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు భోగ గంగాధర్, బీఆర్ఎస్ నాయకులు ఎలామాద్రి కిషోర్, గాజుల శ్రీనివాస్, పెండెం గంగాధర్, గంగిపెల్లి వేణు మాధవ్, భారత్ ప్రశాంత్, కావేటి నవీన్, మధుకర్, భగవాన్, రాజ్, అనురాధ, కవితతో పాటు అలిశెట్టి ప్రభాకర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube