BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనకు గుర్తుగా ఘనంగా 'ఏక్ పేడ్ మా కే నామ్

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 03:31 PM
139 వీక్షణలు

​హాజీపూర్ : భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రికార్డు స్థాయిలో 12 సంవత్సరాలు అధికారంలో ఉన్న సందర్భంగా హాజీపూర్ మాజీ మండల అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి ఆధ్వర్యంలో రాపల్లి గుడి వద్ద ఘనంగా మొక్కలు నాటారు. ప్రధాని పిలుపునిచ్చిన 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక మొక్క) కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును బ్రేక్ చేసి నరేంద్ర మోడీ పాలన కొనసాగిస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కొనియాడారు.

​దేశంలో భూతాపం పెరగడం, భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడం, వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, అడవులు అంతరిస్తున్న నేపథ్యంలో.. ప్రతి వ్యక్తి తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని ప్రధాని మోడీ ఇచ్చిన సందేశం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారిందని నాయకులు అన్నారు. ప్రకృతి సమతుల్యత కోసం ప్రజలందరూ తమ తల్లిదండ్రుల పేర్లపై విరివిగా మొక్కలు నాటాలని కోరారు. భారతీయ జనతా పార్టీ అంటే కేవలం రాజకీయాలే కాకుండా ప్రజా సంక్షేమం, దేశ అంతర్గత భద్రత, పర్యావరణం, సుపరిపాలన, స్వచ్ఛభారత్, విద్య, ఆరోగ్యం పట్ల స్పష్టమైన దృఢ సంకల్పంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ వర్షాకాలంలో ప్రతి కార్యకర్త ఎవరి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా తమ ప్రాంతాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ మొక్కలు నాటాలని, దీనిని కేవలం మొక్కుబడిగా కాకుండా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఒక ఉద్యమంలా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నా రాజా సిసోడియా, సీనియర్ నాయకులు కాసెట్టి నాగేశ్వరరావు, తులా మధుసూదన్ రావు, బొలిశెట్టి తిరుపతి, హాజీపూర్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి మడిపల్లి సత్యం, కమలాకర్ లగిశెట్టి, దాస్య నాయక్, గందే శ్రీనివాస్, మల్లేష్, శ్రీధర్, ఆలయ పూజారి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు