BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 16 June 2026, 03:19 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Jun, 2026 - 03:19 PM
152 వీక్షణలు

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. మంచిర్యాలలో మంగళవారం ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్న బస్సుల దుస్థితిని చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు.

​జిల్లా రవాణా శాఖ అధికారి గోపికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలు బహిర్గతమయ్యాయి. బస్సుల్లో అత్యవసర సమయాల్లో ఉపయోగించే ఫస్ట్‌ఎయిడ్ (ప్రథమ చికిత్స) బాక్సులు లేకపోవడం, టైర్లు పూర్తిగా అరిగిపోయి (తేలిపోయి) ఉండటం గమనించిన డీటీవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా విద్యార్థుల ప్రాణాలను గాలికొదిలేస్తున్న ఇలాంటి ప్రమాదకర బస్సుల గురించి తల్లిదండ్రులు సైతం తెలుసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

​నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడిచిన రెండు రోజుల్లో నిబంధనలు పాటించని 5 స్కూల్ బస్సులను సీజ్ చేశామని డీటీవో తెలిపారు. విద్యార్థుల భద్రతే తమ ప్రాధాన్యమని, రాబోయే రోజుల్లో కూడా ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు