BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 09 November 2025, 09:35 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం!

తెలంగాణ
09 Nov, 2025 - 09:35 PM
200 వీక్షణలు
భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం! N TODAY NEWS: ప్రత్యేక కథనం దేశంలోనే తొలిసారిగా సహజ మరణం పొందిన వ్యక్తి నుంచి అవయవాల సేకరణ ఢిల్లీ మణిపాల్ ఆసుపత్రి వైద్యులు సాధించిన ఘనత ‘నార్మోథెర్మిక్‌ రీజనల్‌ పర్ఫ్యూజన్‌’ అనే ప్రత్యేక ప్రక్రియ వినియోగం గుండె ఆగిపోయిన 5 నిమిషాల తర్వాత కాలేయం, కిడ్నీల సేకరణ మోటార్ న్యూరాన్ వ్యాధిగ్రస్థురాలు గీతాచావ్లా అవయవదానంతో ఆదర్శం బ్రెయిన్‌డెడ్ కేసుల్లోనే సాధ్యమనుకున్న అవయవదానంలో కొత్త శకం ఆవిష్కృతమైంది భారత వైద్య రంగంలో ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా, సహజంగా మరణించిన వ్యక్తి నుంచి వైద్యులు విజయవంతంగా అవయవాలను సేకరించారు. ఢిల్లీలోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు ఈ అరుదైన ఘనత సాధించారు. ఈ సంఘటనతో అవయవదానంపై ఉన్న పరిమితులు తొలగిపోయి, కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణంగా మన దేశంలో బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. అంటే, మెదడు పనిచేయడం ఆగిపోయినా గుండె కొట్టుకుంటున్న వారి నుంచే అవయవదానానికి చట్టపరమైన అనుమతి ఉంది. కానీ, ఢిల్లీ వైద్యులు ‘నార్మోథెర్మిక్‌ రీజనల్‌ పర్ఫ్యూజన్‌’ అనే ప్రత్యేక ప్రక్రియ ద్వారా సహజ మరణం తర్వాత కూడా అవయవాలను సేకరించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతున్న 55 ఏళ్ల గీతాచావ్లా ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆమె ముందుగానే తన అవయవాలను దానం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నవంబర్ 6వ తేదీ రాత్రి 8.43 గంటలకు ఆమె గుండె ఆగిపోవడంతో సహజంగా మరణించారు. చట్టపరమైన నిబంధనల దృష్ట్యా, ఆమె మరణించిన ఐదు నిమిషాల తర్వాత వైద్యులు ఈ ప్రత్యేక ప్రక్రియను ప్రారంభించారు. ఈ విధానంలో పంప్ ద్వారా ఆమె పొత్తికడుపు భాగానికి రక్త ప్రసరణను కృత్రిమంగా పునరుద్ధరించారు. దీనివల్ల కాలేయం, మూత్రపిండాలు పాడవకుండా సజీవంగా ఉన్నాయి. అనంతరం వాటిని విజయవంతంగా సేకరించి, అవసరమైన వారికి అమర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రక్రియ గత రెండు దశాబ్దాలుగా వాడుకలో ఉన్నప్పటికీ, మన దేశంలో దీనిని చేపట్టడం ఇదే ప్రథమం. ఈ విజయంతో దేశంలో అవయవాల కొరతను అధిగమించేందుకు ఒక కొత్త మార్గం తెరుచుకున్నట్లయింది. గీతాచావ్లా కుటుంబం తీసుకున్న గొప్ప నిర్ణయం, వైద్యుల నైపుణ్యం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. Follow us on Website Facebook Instagram YouTube