BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 19 August 2025, 08:18 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

మర్యాల చెరువుకుంటలో వ్యక్తి గల్లంతు.

తెలంగాణ
19 Aug, 2025 - 08:18 PM
518 వీక్షణలు
బొమ్మలరామారం మండలం, మర్యాల చెరువుకుంటలో వ్యక్తి గల్లంతు. NTODAY NEWS: బొమ్మలరామారం, యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మర్యాల గ్రామ రెవెన్యూ పరిధిలో మంగళవారం రోజున ఈత కోసం వెళ్లిన బాలాజీ క్రషర్ లో పనిచేసే కార్మికుడు చెరువు కుంటలో పడి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బొమ్మలరామారం మండలంలో మర్యాల గ్రామ సమీపంలోని బాలాజీ స్టోన్ క్రషర్ వద్ద ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 30 మంది కార్మికులు క్రషర్ కంపెనీలో గత ఐదు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. వీరిలో ఐదుగురు కార్మికులు మంగళవారం ఉదయం 7గంటల సమయంలో స్టోన్ క్రషర్ సమీపంలోని చెరువు కుంటలో ఈత కోసం వెళ్లారు ఐదుగురిలో భారతి నందులాల్(24) తోటి కార్మికులతో కలిసి ఈత కొడుతుండగా చెరువు కుంటలోనే మునిగిపోయాడు అతడి కోసం తోటి కార్మికులు వెతకగా ఆచూకీ లభ్యం కాలేదు తోటి కార్మికుడు గల్లంతు కావడంతో స్టోన్ క్రషర్ సూపర్వైజర్ కు సమాచారమిచ్చారు వెంటనే వారు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగా ఎస్ఐ బుగ్గ శ్రీశైలం సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే స్థానిక గజ ఈతగాళ్లతో గల్లంతైన వ్యక్తి కోసం వెతికించారు అయినా ఫలితం లేకపోవడంతో ఫైర్ సిబ్బందిని పిలిపించి మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు గల్లంతైన వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ జిల్లా, కసిమాబాద్ మండలం,మద్గుంపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. రాత్రి సమయం కావడంతో వెలుతురు లేకపోవడంతో తిరిగి బుధవారం ఉదయం నుంచి వెతికే ప్రయత్నాలు చేస్తామని స్థానిక ఎస్సై శ్రీశైలం తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube