BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 23 June 2026, 07:45 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రభుత్వ ఖాతాలు, డిపాజిట్లపై తెలంగాణ సర్కార్ ఆరా

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:45 AM
124 వీక్షణలు

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో ఎన్ని ఖాతాలు ఉన్నాయి, వాటిలో ఎంత మేరకు డిపాజిట్లు ఉన్నాయనే వివరాలను తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులకు లేఖలు పంపి పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించింది.

ఇటీవల ఎస్బీఐకి సంబంధించిన భూమిని ప్రభుత్వం వేలం వేయడం, ఆ చర్యపై బ్యాంకు అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఎస్బీఐలో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లను వెనక్కి తీసుకోవాలని, ఇకపై ప్రభుత్వ శాఖలు ఎస్బీఐ ద్వారా లావాదేవీలు నిర్వహించకుండా చూడాలని ముఖ్యమంత్రి మౌఖికంగా సూచించినట్లు తెలుస్తోంది. అలాగే భవిష్యత్తులో ఎస్బీఐలో కొత్తగా డిపాజిట్లు చేయాలంటే ముందుగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని అన్ని శాఖలకు సమాచారం పంపినట్లు తెలిసింది.

దీంతో ప్రభుత్వ నిధుల నిర్వహణ, బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.