BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 22 May 2026, 08:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 08:05 PM
159 వీక్షణలు

ఘనంగా ఆధునిక భారతదేశ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో సంఘసంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజా రామ్మోహన్ రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాజా రామ్మోహన్ రాయ్ 1828 ఆగస్టు 20న బ్రహ్మ సమాజాన్ని స్థాపించి సమాజంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సతీసహగమనం నిర్మూలన, మహిళా విద్యాభివృద్ధి, మహిళలకు ఆస్తి హక్కులు కల్పించడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనను “ఆధునిక భారతదేశ పితామహుడు”గా గుర్తిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు దేవర అంజలి, మీనుగు మాధవి తదితరులు పాల్గొన్నారు.