BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 06 July 2026, 08:49 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకే 'సర్' కార్యక్రమం ఓటరు నమోదు అధికారి శారదా దేవి..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Jul, 2026 - 08:49 PM
93 వీక్షణలు

తిరుపతి | NTODAY NEWS

167-తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఓటరు నమోదు అధికారి (ERO) శారదా దేవి తెలిపారు.

సోమవారం ఎస్.టి.వి నగర్, ఎస్.జి.ఎస్. కళాశాల పరిసరాలు, ఆటోనగర్, ముత్యాలరెడ్డిపల్లి, 12, 13వ వార్డు సచివాలయ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, ఎన్యూమరేషన్ ఫారాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. 2002 తర్వాత ఈ ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ నిర్వహిస్తున్నామని పేర్కొంటూ, పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరిన శారదాదేవి, అందించిన ఫారాలను పూర్తిగా నింపి వీలైనంత త్వరగా సంబంధిత సిబ్బందికి అందజేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డీఈవోలు మహేష్, లలిత, స్వర్ణ, వార్డు కార్యదర్శులు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) తదితరులు పాల్గొన్నారు.