BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 11 August 2026, 03:32 pm
Posted by : SIVA RAJ

ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు..

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
11 Aug, 2026 - 03:32 PM
64 వీక్షణలు

ఆగస్టు 13న తాడేపల్లిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సీఎం చంద్రబాబు పర్యటన.. స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం నేపథ్యంలో మార్గాల్లో మార్పులు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 13న తాడేపల్లి టౌన్‌లో ప్రకాశం బ్యారేజీ సమీపంలోని కేఎల్ రావు కాలనీ వద్ద నూతన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు.

ప్రజలు, నాయకులు, హైకోర్టు న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపులకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

 ప్రధాన ట్రాఫిక్‌ మళ్లింపులు

1. విజయవాడ → ఉండవల్లి:

ప్రకాశం బ్యారేజీ చెక్‌పోస్ట్ డౌన్ → సీతానగరం ఘాట్ → రామకృష్ణ మిషన్ స్కూల్ రోడ్డు → ఉండవల్లి స్క్రూ బ్రిడ్జి → ఉండవల్లి సెంటర్.

2. ఉండవల్లి → విజయవాడ:

ఉండవల్లి సెంటర్ → స్క్రూ బ్రిడ్జి → బోట్‌యార్డ్ → రైల్వే అండర్‌పాస్ → NTR కట్ట → ఓల్డ్ టోల్‌గేట్ సెంటర్ → విజయవాడ.

3. తాడేపల్లి బైపాస్ → విజయవాడ:

ఓల్డ్ టోల్‌గేట్ సెంటర్ → NTR కట్ట → పట్టాభి సీతారామయ్య రోడ్డు → మహానాడు రోడ్డు నంబర్‌–3 → సీతానగరం ఘాట్ → ప్రకాశం బ్యారేజీ చెక్‌పోస్ట్ → విజయవాడ.

4. తాడేపల్లి బైపాస్ → హైకోర్టు/సచివాలయం:

ఓల్డ్ టోల్‌గేట్ సెంటర్ → NTR కట్ట → రైల్వే అండర్‌పాస్ → బోట్‌యార్డ్ → స్క్రూ బ్రిడ్జి → ఉండవల్లి సెంటర్ → ఉండవల్లి సచివాలయం.

5. మంగళగిరి → విజయవాడ:

మంగళగిరి → AIIMS → సాయిబాబా గుడి → వడ్డేశ్వరం → దీపికా హైవే → విజయవాడ.

6. తాడేపల్లి → విజయవాడ:

డోలాస్ నగర్ → ప్రకాశ్ నగర్ → నులకపేట → ముగ్గు రోడ్డు → రైల్వే గేట్ → కొత్తూరు → భారతమాత సెంటర్ → ఓల్డ్ టోల్‌గేట్ సెంటర్ → విజయవాడ.

ప్రజలు సహకరించాలని పోలీసుల విజ్ఞప్తి

ముఖ్యమంత్రి పర్యటన, స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు చేపట్టిన ఈ మళ్లింపులకు వాహనదారులు సహకరించాలని గుంటూరు జిల్లా పోలీసులు కోరారు.