BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 23 August 2026, 05:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డు లేకున్నా కిలో రూ.50కే నాణ్యమైన బియ్యం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:20 PM
62 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డు లేకున్నా కిలో రూ.50కే నాణ్యమైన బియ్యం

ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య ప్రజలకు ఊరట కలిగించేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు లేని వారికి కూడా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించే విధంగా చర్యలు చేపట్టింది. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సబ్సిడీ ధరలకు బియ్యం విక్రయాలు ప్రారంభించింది.

బయట మార్కెట్‌లో కిలో రూ.65 వరకు ఉన్న బీపీటీ ముడి బియ్యాన్ని కేవలం రూ.50కే, బీపీటీ స్టీమ్డ్ బియ్యాన్ని రూ.52కే అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ సదుపాయం పొందేందుకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి కాదని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండి, ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 130కి పైగా రైతు బజార్లు, ఎంపిక చేసిన రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి.

అదేవిధంగా రేషన్ దుకాణాలను మరింత విస్తరించి, 250కి పైగా నిత్యావసర సరుకులను తక్కువ ధరకే అందించేలా 1000కు పైగా మినీ మార్టుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నిర్ణయంతో రేషన్ కార్డు లేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.