BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 28 August 2026, 06:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నెమలిలో వైభవంగా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి కల్యాణం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 06:05 PM
65 వీక్షణలు

నెమలిలో వైభవంగా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి కల్యాణం

గంపలగూడెం:

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

ఆలయ అర్చకులు టీ. గోపాలచార్యులు వైఖానస పద్ధతిలో వేదమంత్రాల నడుమ కల్యాణ తంతును నిర్వహించారు. ముందుగా స్వామివారికి, అమ్మవారికి నూతన వస్త్రాలతో ప్రత్యేక అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన కల్యాణ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. సంధ్య, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.