BREAKING
thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు
Date of Publish : 20 August 2026, 09:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు.....

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 09:59 PM
308 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు.. సెప్టెంబర్‌ నుంచి ఎన్నికల సందడి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలకు విడతల వారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 7న మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ విడుదల కాగా, సెప్టెంబర్‌ 20న పోలింగ్, సెప్టెంబర్‌ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సెప్టెంబర్‌ 28న నోటిఫికేషన్ విడుదల చేసి, అక్టోబర్‌ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 14న ఫలితాలు ప్రకటించనున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు అక్టోబర్‌ 19న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్‌ 28న పోలింగ్‌తో పాటు ఫలితాలు వెల్లడించనున్నారు. నవంబర్‌ 1 నుంచి కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి.

స్థానిక పాలనలో ప్రజల భాగస్వామ్యం కీలకం.. ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు

ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి తోడ్పడాలని అధికారులు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామాలు, పట్టణాల భవిష్యత్‌ అభివృద్ధికి కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.