BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

ఆర్థిక భద్రతతోనే మహిళల జీవితాల్లో వెలుగులు : ప్రత్తిపాటి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
02 Jun, 2026 - 04:29 PM
30 వీక్షణలు

ఆర్థిక భద్రతతోనే మహిళల జీవితాల్లో వెలుగులు : ప్రత్తిపాటి

• సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగిపోతేనే వేగవంతమైన అభివృద్ధి 

• సామాజిక సేవా సంస్థలు, సంపన్నులు ప్రభుత్వ ఆశయంలో భాగం కావాలి.

• పేద మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన ప్రత్తిపాటి.

రెక్కల కష్ఠం, శక్తియుక్తులతో జీవించే పేద, మధ్య తరగతి మహిళల జీవితాలు మెరుగుపడి, ఆర్థిక భద్రత లభిస్తేనే, సమాజానికి మేలు జరుగుతుందని, ఆ దిశగా స్వచ్చంద సంస్థలతో పాటు.. కార్పొరేట్ సంస్థలు తమ సహాయ సహకారాలు అందించాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. 

మంగళవారం ఆయన పట్టణ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో జి.డి.యం.సి. చైర్మన్ వడ్డ్రణం హరిబాబు తో కలిసి పాల్గొని, 20 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రోటరీ క్లబ్ నిర్వాహకుల సేవల్ని కొనియాడారు. 

రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పంలో సామాజిక, సేవా సంస్థలు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. ప్రజా సేవకు రాజకీయాలతో పనిలేదని, మంచి చేయాలనే ఆశయం, ఆలోచన ఉంటే సరిపోతుందన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగినప్పుడే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. మారుతున్న కాలంతో పాటు.. సంపన్నులు, సామాజికంగా,  ఆర్థికంగా బలంగా ఉన్నవారి ఆలోచనా విధానం మారాలని, అప్పుడే పేదరికమనే జబ్బు మాయమవుతుందన్నారు.  ప్రభుత్వ ఆశయానికి ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, ప్రజల సహాకారం తోడైతేనే పీ-4 విజయవంతంగా అమలవుతుందని ప్రత్తిపాటి చెప్పారు.  

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందిమల్ల జయమ్మ, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, రోటరీ క్లబ్ సభ్యులు ఉప్పుటూరి ప్రసాద్, బోడే రామసుబ్బారావు, చిలుకూరి శ్రీనివాసరావు, కాంతయ్య, అడుసుమల్లి మోహన్ రావు, సాంబశివరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కూటమి నాయకులు, తదితరులు  పాల్గొన్నారు.